ETV Bharat / city

ఈ చెట్టుకు ఏడు రకాల మామిడి కాయలు - summer

వేసవి వచ్చిందంటే మామిడి ప్రియులకు పండుగే.  వివిధ రకాల మామిడి కాయలను రుచి చూడాలనుకునేవారి మార్కెట్​ మొత్తం వెతికాలి. కానీ మీరు ఆ తోటకు వెళితే ఒక్క చెట్టు నుంచే అన్నిరకాల మామిడి కాయలు పొందవచ్చు. ఆ చెట్టు ఏడు రకాల మామిడిని అందిస్తుంది. ఇలా ఆ తోటలో 57 రకాల మామిడి కాయలు లభిస్తాయి.

57 రకాల మామిడి కాయలు ఒకే చోట
author img

By

Published : May 15, 2019, 12:48 PM IST

57 రకాల మామిడి కాయలు ఒకే చోట

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో నివాసముంటోన్న విశ్రాంత ఉద్యోగి వెంకటపతి రాజుకు మొక్కల పెంపకం అంటే మక్కువ. తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. అంటుకట్టు విధానంలో ప్రయోగాలు చేస్తూ 57 రకాల మామిడి కాయలు పండిస్తున్నారు.
ఒక చెట్టుకి ఏడు రకాలు, మరో చెట్టుకి నాలుగు రకాల పండ్లను పండిస్తూ తన అభిరుచిని చాటుకున్నారు. 2001 నుంచి తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 250 మామిడి చెట్లతో పాటు పనస, ఉసిరి, అల్లనేరేడు, సీతాఫలం, జామ, కొబ్బరితో పాటు అనేక రకాల మొక్కలున్నాయి.
అంటుకట్టు విధానంలో...
చెట్టు ఎదిగిన తరువాత దానికి ఉన్న కొమ్మలను తొలగించారు, అనంతరం కొద్దిరోజుల తరువాత చిగురు వచ్చే సమయంలో ఏ కొమ్మకు ఏ రకం మామిడి కావాలో ఆ కొమ్మలతో అంటుకట్టారు. ఈ విధానంలో ఒక చెట్టుకు 7 రకాల మామిడి పండ్లు పండిస్తున్నారు. ఇలా ఒక చెట్టుకి 50 కొమ్మలు ఉంటే 50 రకాల మామిడిని పండించవచ్చు అంటున్నారు.

విక్రయించడానికి కాదు..
తన ఫామ్ హౌస్ లో పండించే పండ్లను 18 ఏళ్లలో ఒక్కసారి కూడా విక్రయించలేదని వెంకటపతి రాజు తెలిపారు. 50 శాతం పండ్లను పక్షులే తింటాయని, అవి తినగా మిగిలినవి ఇంటికి తీసుకెళ్లడం, బంధువులకు, స్నేహితులకు ఇస్తున్నట్లు తెలిపారు.
అంటుకట్టే పద్ధతిలో తక్కువ స్థలంలో ఒకే చెట్టుకు బంగినపల్లి, కొబ్బరి మామిడి, దసేరి, లంగడ, కేసరి, ముంతమామిడి, చిన్న రసాలు, సొర మామిడి...పెంచి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు విశ్రాంత ఉద్యోగి వెంకటపతి రాజు.

ఇవీ చూడండి: WC19 : గెలుపు ముంగిట "మలుపు" కథలు

Intro:Hyd_tg_45_14_seven types of mangoes in one tree_pkg_C29

మేడ్చల్ : దుండిగల్
ఒకే చెట్టుకు ఏడు రకాల మామిడికాయలు..
గ్రాఫ్టింగ్ పద్దతిలో మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్న విశ్రాంత ఉద్యోగి వెంకటపతి రాజు.

Body:యాంకర్ : తక్కువ స్థలంలో ఒకే చెట్టుకు వివిధ రకాల మామిడి పండ్లు గ్రాఫ్టింగ్ పద్దతి ద్వారా ఏడు రకాల పండ్లు బంగినపల్లి, కొబ్బరి మామిడి, దసేరి, లంగడ, కేసరి, ముంతమామిడి, చిన్న రసాలు, సొర మామిడి...పెంచి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి వెంకటపతి రాజు..

వాయిస్ : నగర శివారు ప్రాంతమైన దుండిగల్ హలో ఆయనకున్న నాలుగు ఎకరాల ఫామ్ హౌస్ లో లో దాదాపు అన్ని రకాల పండ్ల మొక్కలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా 57 రకాల మామిడి పండ్లును ఆయన పండిస్తున్నారు. ఒక చెట్టుకి ఏడు రకాలు, మరో చెట్టుకి నాలుగు రకాల పండ్లను పండిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు.
మొక్కలపై తనకున్న ప్రేమతో 2001 నుంచి తన ఫామ్ హౌస్ లో మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో 250 మామిడి చెట్లతో పాటు పనస, ఉసిరి, అల్లనేరేడు, సీతాఫలం, జామ, కొబ్బరి ఇలా అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు.

*గ్రాఫ్టింగ్ పద్దతి ఎలా సాధ్యమంటే...?*
చెట్టు ఎదిగిన తరువాత దానికి ఉన్న కొమ్మలను తొలగించారు, అనంతరం కొద్దిరోజుల తరువాత చిగురు వచ్చే సమయంలో ఏ కొమ్మకు ఏ రకం మామిడి కావాలో ఆ కొమ్మలను తెప్పించి గ్రాఫ్టింగ్ పద్దతిలో అంటుకట్టడంతో ఈ ప్రక్రియ ముగుస్తుందంటున్నారు వెంకటపతి రాజు..
ఈ విధానంలో ఆయన ఒక చెట్టుకు 7 కుమ్మక్కు 7 రకాల మామిడి పండ్లు పండిస్తున్నారు..
ఇలా ఒక చెట్టుకి 50 కొమ్మలు ఉంటే 50 రకాల మామిడిని గ్రాఫ్టింగ్ పద్దతిలో పెంచుకోవచ్చని తెలిపారు

తన ఫామ్ హౌస్ లో పండించే పండ్లను 18 ఏళ్లలో ఒక్కసారి కూడా విక్రయించలేదని 50 శాతం పండ్లను పక్షులే తింటాయని, అవి తినగా మిగిలినవి ఇంటికి తీసుకెళ్లడం బంధువులకు, స్నేహితులకు ఇస్తున్నట్లు తెలిపారు.

Conclusion:బైట్ : కె.వెంకటపతి రాజు, విశ్రాంత ఉద్యోగి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.