ETV Bharat / city

వరద బాధితుల కోసం.. మనం సైతం విరాళాల సేకరణ

వరద బాధితులకు తోడ్పాటు అందించేందుకు మనంసైతం సంస్ధ ముందుకు వచ్చింది. హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో మనంసైతం ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సంస్ధ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ తెలిపారు. ఫిలిం ఛాంబర్​లో పలువురు సంస్ధకు విరాళాలు అందజేసినట్లు అయన పేర్కొన్నారు.

Manam Saaitham Foundation Taking Donations for floods victims
వరద బాధితుల కోసం.. మనంసైతం విరాళాల సేకరణ
author img

By

Published : Oct 20, 2020, 4:19 PM IST

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులకు గురవుతున్న వరద బాధితులకు అండగా ఉండటం కోసం మనంసైతం ఫౌండేషన్​ విరాళాలు సేకరిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్​ అన్నారు. ఫిలిం ఛాంబర్​లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

పలు సందర్భాల్లో బాధితులకు తమ వంతు సహాయం చేసేందుకు మనంసైతం సంస్థను ఏర్పాటు చేసినట్లు కిరణ్​ వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన విరాళాలను ప్రకృతి ప్రకోపానికి గురైన బాధితులకు అందజేస్తామన్నారు. తమ సంస్ధ ఆధ్వర్యంలో గతంలో కూడా ఇలాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమాజంలో ఉంటున్నందుకు.. ఆపదలో ఉన్నవారికి మన వంతు సాయం అందించడం మన బాధ్యతగా భావించాలన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో కొనసాగుతోన్న వరుణుడి ప్రతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.