ETV Bharat / city

BLACK FUNGUS: బ్లాక్​ ఫంగస్​తో ఏపీలో వ్యక్తి మృతి.. స్విమ్స్​ ముందు భార్య ఆందోళన - black fungus cases in andhra pradesh

ఏపీలోని తిరుపతి స్విమ్స్​లో బ్లాక్​ ఫంగస్​ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని మృతుని భార్య ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగింది.

black fungus deaths at Tirupati
తిరుపతిలో బ్లాక్ ఫంగస్​తో వ్యక్తి మృతి
author img

By

Published : Jun 16, 2021, 4:04 PM IST

బ్లాక్​ ఫంగస్​ కారణంగా ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి స్విమ్స్​లో ఓ వ్యక్తి మృతి చెందాడు. తన భర్త మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతని భార్య ఆరోపించింది. ఈ ఘటనకు కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగింది.

ఏపీలోని కడప జిల్లా చక్రాయపేట గ్రామానికి చెందిన ఆంజనేయులు నాయక్ (38)కు బ్లాక్ ఫంగస్ సోకటంతో.. మే 28న తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఫంగస్ మెదడుకు వ్యాపించడంతో.. బుధవారం తెల్లవారుజూమున అతడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే తన భర్తను చంపేసిందని మృతుని భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.

తిరుపతిలో బ్లాక్ ఫంగస్​తో వ్యక్తి మృతి

ఇదీ చదవండి: రౌడీషీటర్ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.