సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బీజాపూర్ ప్యాసింజర్ రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఝార్ఖండ్ వాసిగా పోలీసులు గుర్తించారు. మొదట ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు యత్నించగా ప్రయాణికులు కాపాడారు. వెంటనే 4వ ప్లాట్ ఫారానికి వెళ్లి బీజాపూర్ ప్యాసింజర్ కింద పడి బలవన్మరణం చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారాన్ని అందజేశారు.
మరో కేసులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బొల్లారం- గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ మధ్య పట్టాలు దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: ఇస్మార్ట్ గంజాయి ముఠా...!