బాత్రూంకు వెళ్లగానే బల్లి, పురుగు కనపడితే కెవ్వున అరుస్తాం. వాటికన్నా పెద్ద సైజు ఆకారాలు ఏవైనా కనపడితే ఇక బయటకు పరుగులు తీస్తాం. అదే ఓ కొండచిలువ కనపడితే? అది కూడా సరిగ్గా సమయం చూసుకుని మర్మాంగాన్ని కొరికితే? ఊహించుకోవడానికి అత్యంత భయంకరంగా ఉంది కదా! కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి ఇదే జరిగింది.
అక్కడికి ఎలా వెళ్లింది?
ఆస్ట్రేలియా గ్రాజ్లో జరిగింది ఆ ఘటన. ఓ 65 ఏళ్ల వ్యక్తి ఉదయం.. తన ఇంట్లో బాత్రూంకు వెళ్లాడు. టాయిలెట్ సీట్ మీద కూర్చునేసరికి అతని మర్మాంగాన్ని ఏదో కరిచినట్టు అనిపించి కిందకు చూశాడు. ఓ ఐదడుగుల కొండచిలువను చూసి షాక్ అయ్యాడు. అయితే ఆ పాము విషపూరితం కాకపోవడం వల్ల ఆయనకు స్వల్ప గాయలు మాత్రమే అయ్యాయి.
ఈ 65 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా.. ఆ కొండచిలువు ఆ వ్యక్తి పొరుగింటి 24 ఏళ్ల మనిషిదని తేలింది. డ్రైనేజీ ద్వారా అక్కడకు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పొరుగింటి వ్యక్తి దగ్గర మొత్తం 11 పాములు ఉన్నట్టు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:- 10 కోడి గుడ్లను కక్కిన పాము- వీడియో వైరల్