హైదరాబాద్ మల్కాజిగిరి పోలీసులు కరోనా, లాక్డౌన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ట్రాక్టర్లకు మైకులు బిగించి ప్రచారం చేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలలో వీధుల్లో తిరుగుతూనే ట్రాక్టర్లనూ తిప్పుతూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
వైరస్ బారిన పడకుండా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలను చెప్తున్నారు. మల్కాజిగిరిలోని షాదుల్లా నగర్, షఫీ నగర్, మౌలాలీ ప్రాంతాలను కంటైన్మెంట్గా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని గల్లీల్లో ట్రాక్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మల్కాజిగిరి పీఎస్ పరిధిలో 7 ట్రాక్టర్లు, పోలీస్ వాహనాల ద్వారా నిత్యం ప్రచారం చేస్తూ.. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.