పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని మక్తాల ఫౌండేషన్ చైర్మన్ జలంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంజు థియేటర్ సమీపంలో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు.
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జలంధర్ గౌడ్ అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి తన వంతుగా అవగాహన పెంచే క్రమంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తున్నట్టు వెల్లడించారు.