మహా శివరాత్రి సందర్భంగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. వేకువ జామున 3 గంటల నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న కారణంగా.. ఆలయాధికారులు మహా లఘు దర్శనం అమలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం కోసం వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
తలకోనలో...
చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని ఉన్న తలకోన శివాలయంలో మహాశివరాత్రి వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు