సికింద్రాబాద్ చిలకలగూడ మైదానంలోని మహాగణపతి.. అఖిషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. వర్గిల్ వేద బ్రాహ్మణులతో మహాగణపతికి మృత్యుంజయ హోమం, మహా హారతి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడు మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటించారు.
మృత్యుంజయ హోమం సమయంలో వేదమంత్రాలతో పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించాయి. ఏటా తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించే నిర్వాహకులు.. కొవిడ్ దృష్ట్యా ఈసారి మాస్కులు, పండ్లను పంపిణీ చేస్తున్నారు.