కరోనా, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో పేదలు పస్తులుండకూడదనే లక్ష్యంతో ఇప్పటి వరకు 70.21 శాతం ఉచిత బియ్యం పంపిణీ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉచిత బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం రూ.11200 కోట్ల కేటాయించిందన్నారు. రాష్ట్రంలో 87.55 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 17,200 చౌక ధరల దుకాణాల ద్వారా 62 లక్షల కార్డుదారులకు ఉచితంగా 2 లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామని ప్రకటించారు.
సర్వర్ డౌన్ అయింది..
మొదట్లో రెండు రోజుల పాటు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనన్నారు. సర్వర్ డౌన్ అయిందని, వెంటనే సమీక్షించి సర్వర్ సామర్థ్యం పెంచామని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... పశ్చిమ్బంగా సీఎం మమతా బెనర్జీతో కూడా మాట్లాడారని తెలిపారు. ఈ లోగా రాష్ట్రంలో ఉన్న చౌక ధరలు దుకాణాల్లోని బియ్యం బస్తాలు, వ్యాపారుల వద్ద ఉన్న బస్తాలు కూడా ఇవ్వాలని ఆదేశించామన్నారు.
మోదీతో కూడా సీఎం మాట్లాడారు..
ఈ విషయంపై సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో కూడా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రకరకాల వనరుల ద్వారా పాతవి, కొత్తవి సమీకరిస్తూ క్షేత్రస్థాయిలో గన్నీ బ్యాగుల కొరత ఉత్పన్నం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనా టెస్ట్ చేయిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్!'