ETV Bharat / city

రాష్ట్రంపై మరోసారి చలి పంజా.. రానున్న మూడు రోజులు..! - రాష్ట్రంపై మరోసారి చలి పంజా.. రానున్న మూడు రోజులు..!

రాష్ట్రంపై మరోసారి చలి పంజా.. రానున్న మూడు రోజులు..!

author img

By

Published : Feb 5, 2022, 11:52 AM IST

11:47 February 05

రాష్ట్రంపై మరోసారి చలి పంజా.. రానున్న మూడు రోజులు..!

రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త మరోసారి పెరిగింది. గ‌త రెండు, మూడు రోజులుగా తక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు మరింత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా మూడు రోజుల పాటు గ‌రిష్ఠ, క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ల్లో త‌గ్గుద‌ల న‌మోదు కానున్న‌ట్లు తెలిపింది.

రాష్ట్రంపై ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంద‌ని.. ఇది నైరుతి బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ఫలితంగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ మూడు రోజులు సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు నమోదవుతాయ‌ని.. మిగ‌తా జిల్లాల్లో సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌ల‌తో పోలిస్తే.. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పింది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా శుక్ర‌వారం న‌మోదయిన ఉష్ణోగ్ర‌త‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. గరిష్ఠ ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అర్లిటిలో 6 డిగ్రీలు, బేలాలో 6.9 డిగ్రీలు న‌మోదు అయ్యాయి.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.