శీతాకాలం ప్రారంభం నుంచే రాష్ట్రంలో చలి ప్రభావం అధికంగా ఉంటుంది. తెలంగాణలోకి శీతల గాలులు వీస్తుండడంతో చలి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోను చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయం సమయాలల్లో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి.
చలి తీవ్రతకు యాచకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో బర్త్‌డే పార్టీలతో కిటకిటలాడే నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు చలి ప్రభావంతో జనాలు రాక బోసిపోయాయి. రాత్రి 10 దాటితే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో నగరంలోని రహాదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఇవీ చూడండి: దట్టంగా పొగమంచు.. జాగ్రత్తలతో అధిగమించు