ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ దుర్ఘటనలో గ్యాస్ లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు.
స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లారీ డ్రైవర్ను తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 4 గంటలు కష్టపడి డ్రైవరును బయటకి తీసి ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు దోనపాటి చంటి (40 ) ఐ.పోలవరం మండలంలోని టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని... ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.
ఇవీ చూడండి: సెల్ఫీ వైరల్: 'నేను చచ్చిపోతున్నా.. నా కోసం ఎవరూ వెతకొద్దు'