Lokesh Fire On Jagan: ఏపీ హిందూపూర్ నియోజకవర్గం సంజీవరాయనపల్లి గ్రామంలో దివ్యాంగురాలు పద్మావతికి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ఆమె తనయుడు వేణు ప్రశ్నిస్తే.. స్థానిక వైకాపా నేత దామోదర్ రెడ్డి దాడి చేశారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళితే.. అక్కడ ఎస్ఐ ఘోరంగా అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. వేణుపై దాడి చేసిన వైకాపా నేతలు, ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకొని దివ్యాంగురాలైన తల్లి పద్మావతికి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసలేం ఏం జరిగిందంటే..: ఏపీలోని సత్యసాయి జిల్లా చిలమత్తూర్ మండలం సంజీవరాయనిపల్లిలో దివ్యంగురాలైన పద్మావతికి పెన్షన్ రాలేదు. ఈ విషయమై అడగటానికి స్థానిక వైకాపా నాయకుడు దామోదర్ రెడ్డి వద్దకు పద్మావతి కుమారుడు వేణు వెళ్లాడు. అయితే.. శుక్రవారం సాయంత్రం ఈ విషయమై సంజీవరాయ పల్లిలో దామోదర్ రెడ్డి, వేణు మధ్య ఘర్షణ జరిగింది. కాగా.. దామోదర్ రెడ్డి తనపై దాడి చేసి కొట్టాడని, రివర్స్‌లో తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితుడు వేణు వాపోయాడు. అయితే... వేణు పోలీసులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా చిలమత్తూర్ ఎస్ఐ దుర్భాషలాడుతూ వేణుపైనే దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి : ఏలూరు వైకాపా నేత హత్యకేసు నిందితుడు..