ETV Bharat / city

Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు - లాక్​డౌన్​ వార్తలు

lockdown extension in telangana
lockdown extension in telangana
author img

By

Published : May 30, 2021, 6:25 PM IST

Updated : May 30, 2021, 9:41 PM IST

18:24 May 30

రాష్ట్రంలో జూన్​ 9 వరకు లాక్​డౌన్​

రాష్ట్రంలో లాక్‌డౌన్ మ‌రో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన... 5 గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, లాక్​డౌన్​ పొడిగింపు అంశం, వ్యాక్సినేషన్​ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో... జూన్ 9 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

మరో మూడు గంటలు...

లాక్​డౌన్​ పొడిగింపులో భాగంగా... సడలింపు సమయాన్ని ప్రభుత్వం మరో మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు కల్పించగా... మ.2 గంటల నుంచి మరుసటి రోజు ఉ.6 గంటల వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్​...

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాక్సినేషన్‌పై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఆర్థిక రంగం కోలుకోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. 

ఇదీ చూడండి: Etela Rajender: హస్తినకు ఈటల.. భాజపాలో చేరిక జూన్​ 2 తర్వాతే..!

Last Updated : May 30, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.