వివాహాది శుభకార్యాల్లో వడ్డించి మర్యాదలు చేసే క్యాటరర్స్ గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. కొవిడ్ వల్ల సకాలంలో జరగాల్సిన పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాయిదా పడుతుండటం వల్ల ఆర్డర్లు లేక అవస్థలు పడుతున్నారు. ఆరునెలలగా ఎటువంటి శుభకార్యాలు లేక, ఆదాయం రాక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు.
పరిమిత సంఖ్యలో వేడుకలకు హాజరు నిబంధనలు, లాక్డౌన్ ఆంక్షలు వీరి అవకాశాలను మరింత దిగజారుస్తున్నాయి. క్యాటరింగ్ పైనే ఆధారడిన పార్టటైం క్యాటరింగ్ బాయ్స్ పాకెట్ మనీ కోల్పోయారు. పెళ్ళిళ్లు, పేరంటాలు వాయిదా, రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న క్యాటరింగ్ నిర్వాహకులతో ఈటీవీ భారత్ ముఖామఖి..