ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: చిక్కుకుపోయిన వలస కూలీలు - mirchi Labors

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం వలస కూలీలపై తీవ్రంగా పడింది. ఏపీ అంతటా లాక్​డౌన్ కొనసాగుతుండగా.. ప్రజా రవాణా నిలిచిపోయింది. మిర్చి కోతల కోసం కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన కూలీలు ఆయా గ్రామాల్లో చిక్కుకుపోతున్నారు. అధికారులు స్పందించి తమను స్వస్థలాలకు పంపించాలని వేడుకుంటున్నారు.

lock-down-effect-on-migrant-laborers
కరోనా ఎఫెక్ట్​: చిక్కుకుపోయిన వలస కూలీలు
author img

By

Published : Mar 26, 2020, 9:24 PM IST

మిర్చి కోతల కోసం ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన కూలీలు లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏటా మిర్చి కోతల సీజన్​లో రాయలసీమ నుంచి కూలీలు గుంటూరు జిల్లాకు వలస వస్తారు. ఈసారి మిర్చి కోతలకు వచ్చిన కూలీలను.. కరోనా లాక్​డౌన్ కష్టాలకు గురిచేసింది. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాలకు వచ్చిన కూలీలు ఎక్కడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తమను సొంతూళ్లకు వెళ్లేలా చూడాలని వారు కోరుతున్నారు.

తిరిగి వెళ్లేందుకు తమను సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఆపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. మరిన్ని రోజులు ఇక్కడే ఉండేందుకు వెంట తెచ్చుకున్న సరకులు, బియ్యం అయిపోయాయని, చేతిలో డబ్బులు కూడా లేవని ఆవేదన చెందుతున్నారు. పాలకులు, పోలీసులు తమ సమస్యపై దృష్టి సారించాలని కోరాారు.

కరోనా ఎఫెక్ట్​: చిక్కుకుపోయిన వలస కూలీలు

ఇవీచూడండి: కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.