ETV Bharat / city

'ధర్నా విరమించేది లేదు.. అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాం'

author img

By

Published : Dec 1, 2020, 2:23 PM IST

ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్​ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ధర్నా విరమించే కన్నా.. ప్రాణాలు వదిలేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి శాసనసభకు వెళ్లే సమయంలో.. ఆందోళనలు చేయవద్దంటూ.. పోలీసులు అడ్డుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

let-go-of-authoritarian-tendencies-at-amaravathi-guntur-district
'ధర్నా విరమించేది లేదు.. అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాం'

శాంతియుతంగా అందోళన చేస్తున్న తమపై ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్​ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి జగన్ వెళ్తున్న సమయంలో తమ ఆవేదనను వ్యక్తం చేయాలని అనుకుంటే... పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాత్రి 10గంటల సమయంలో తుళ్లూరు డీఎస్పీ, సీఐలు వచ్చి.. ఆందోళన విరమించకపోతే అరెస్టులు చేస్తామని హెచ్చరించినట్టు చెప్పారు.

సీఎం వెళ్లే సమయంలో దీక్ష నుంచి బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని.. ఈ కారణంగా ముఖ్యమంత్రికి తమ సమస్యను చెప్పలేకపోయామని ఆవేదన చెందారు. పోలీసులు ఓ వైపు మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నా చేసే వాళ్ళకే మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. ధర్నా విరమించే కన్నా ప్రాణాలను వదిలేస్తామని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: తుంగభద్రలో మునిగి ఇద్దరు బాలికలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.