ఎండాకాలం అలసట నుంచి కాపాడడమే కాదు.. వడదెబ్బ తగలకుండా తాజాగా ఉంచడంలోనూ నిమ్మకు సాటి మరేదీ లేదు. ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా దివ్యౌషధంగా కూడా నిమ్మకాయ పేరు తెచ్చుకుంది. దీంతో నిమ్మకాయలకు ఎప్పుడూ లేని డిమాండ్ వచ్చింది. అందుకే ఒక్కో నిమ్మకు రూ. 5కి తక్కువ లేకుండా అమ్మేస్తున్నారు. సూపర్ మార్కెట్లలో రూ. 20కి మూడు చొప్పున విక్రయిస్తు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు.
నింబోలి అడ్డ హోల్‌సేల్ మార్కెట్లో చిన్న బస్తాల చొప్పున అమ్ముతున్నారు. ఒక బస్తాలో వెయ్యి నుంచి 1200ల నిమ్మకాయలుంటాయి. అక్కడ ధర రూ.1500లు పలుకుతోంది. అంటే ఒక్కో నిమ్మకాయ రూ.1 చొప్పున పడుతున్నట్టు. మరి అదే నిమ్మకాయ మార్కెట్లో రూ.5కి తక్కువ లేకుండా అమ్ముతుండడం గమనార్హం. గతేడాది లాక్‌డౌన్‌తో అమ్మకాలు తగ్గి డిమాండ్ పడిపోయింది. ఈసారి మాత్రం కేజీ రూ. 150 వరకూ పలుకుతోంది.
ఇవీచూడండి: పర్వదినాల వేళ.. విజృంభిస్తే ఎలా..?