ETV Bharat / city

assembly sessions: నేటి నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు - శాసనసభ సమావేశాలు

Assembly Meetings: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక.. ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రత్యక్షంగా ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశాల్లో.. సుమారు 20 బిల్లులలను ప్రవేశపెట్టొచ్చని సమాచారం.

assembly sessions: నేటి నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

author img

By

Published : Mar 7, 2022, 6:47 AM IST

Assembly Meetings: ఆంధ్రప్రదేశ్​ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్ని రోజులు సమావేశాలు జరపాలనే అంశాన్ని నేటి శాసనసభ సలహా సంఘ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ నెల 26 వరకు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక.. ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రత్యక్షంగా ప్రసంగించడం ఇదే మొదటిసారి. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ఇంతకుముందు సమావేశాల్లో ఆయన రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలోనే ప్రసంగించారు.

ఈ సమావేశాల్లో సుమారు 20 బిల్లులను ప్రవేశపెట్టొచ్చని సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు మినహా మిగతా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవనున్నారు. వారు ఉదయం 9.30కు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి నుంచి బయల్దేరతారు. 10 గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండ వేసి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనగా అసెంబ్లీకి వెళతారని తెదేపా ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రంలో నిరుద్యోగం, నైరాశ్యంలో యువత, సంక్షోభంలో రాష్ట్ర రైతాంగం, అన్నదాతల ఆత్మహత్యలు, హైకోర్టు తీర్పు-అమరావతి నిర్మాణం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ సర్వనాశనం, అక్రమ మైనింగ్‌ వంటి 19 అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని తెదేపా నిర్ణయించింది.

.

ఇదీ చదవండి: Telangana Budget Sessions: నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు.. సంక్షేమానికి పెద్దపీట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.