ETV Bharat / city

CJI Justice NV Ramana AP Tour : 'న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది' - indian judiciary future challenge

CJI Justice NV Ramana AP Tour : రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఏపీలో విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో మాట్లాడారు. దివంగత లావు వెంకటేశ్వర్లు సతీమణి పాదాలకు జస్టిస్ రమణ నమస్కరించారు.

CJI JUSTICE NV RAMANA
జస్టిస్ ఎన్వీ రమణ
author img

By

Published : Dec 26, 2021, 1:21 PM IST

విజయవాడలో దివంగత లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభ

CJI Justice NV Ramana AP Tour : ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత లావు వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ నివాళులర్పించారు. స్మారకోపన్యాస సభలో పాల్గొన్న సీజేఐ.. దివంగత లావు వెంకటేశ్వర్లు సతీమణి పాదాలకు నమస్కరించారు. స్మారక ఉపన్యాస సభలో మాట్లాడారు. నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు నమ్మేవారని చెప్పారు. స్వగ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారని.. వాలీబాల్‌ తదితర క్రీడలను ఆయన ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు. జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు ఆదర్శాలు ఆయన తనయుడు జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలుగురాష్ట్రాల హైకోర్టు జడ్జిలు పాల్గొన్నారు.

ఎన్నో సవాళ్లు

CJI Justice NV Ramana At Siddhartha Law College : ఈ సందర్భంగా ‘భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత అభివృద్ధి, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లడంలో సవాళ్లు ఎదుర్కొన్నామని జస్టిస్​ రమణ చెప్పారు.

"ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించాం. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. న్యాయవ్యవస్థ కూడా ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది. రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర పోషించింది. న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది. కొత్త సవాళ్లను అధిగమించేందుకు దృష్టి సారించాం’’ అని సీజేఐ అన్నారు.

ఇదీ చదవండి: KTR Letter to Bandi Sanjay : 'ఎన్ని కొలువులు ఇచ్చారో లెక్క చెప్పే దమ్ముందా?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.