ETV Bharat / city

నానో మాస్క్... దీని మీద పడితే వైరస్ చచ్చిపోవాల్సిందే..!

కరోనా వైరస్‌ను అంతం చేయడానికి వ్యాక్సిన్లు, ముందులపై పరిశోధనలు చాలానే జరుగుతున్నాయి. కానీ ఏపీలోని విశాఖకు చెందిన శేషగిరిరావు మరో ఇద్దరితో కలిసి కొవడ్‌-19ను‌ లోపలికి వెళ్లకుండా చంపివేసే మాస్క్‌ను కనుగొన్నారు. కరోనా పుణ్యమా అంటూ మాస్క్ మన జీవితంలో భాగమైపోయింది. మాస్క్ పెట్టుకుంటేనే గాని గడప దాటని పరిస్థితి. సాధారణ మాస్కులు కేవలం వైరస్​ను అడ్డుకుంటాయి. అయితే వీరు తయారు చేసిన మాస్క్ ఏకంగా వైరస్​నే చంపేస్తుందని అంటున్నారు.

latest nano mask discovered by vishaka guy in andhra pradesh
నానో మాస్క్... దీని మీద పడితే వైరస్ చచ్చిపోవాల్సిందే..!
author img

By

Published : Jul 10, 2020, 10:19 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన శేషగిరిరావు రెండు దశాబ్దాలకు పైగా లెదర్ బ్యాగులు, బెల్ట్ ఉత్పత్తులు తయారుచేసే యూనిట్​లను నడుపుతున్నారు. దిల్లీ ఐఐటీ ఈ ఎంటర్‌ప్రెన్యూర్ సెల్ మాజీ సభ్యుడు కేవీ రమణ, ఏయూ పోస్ట్ డాక్టరల్ ఫెలో దేముడుతో కలిసి ఈ నానో మాస్క్‌ను అభివృద్ధి చేశారు. నానో ఫోటానిక్ ఫిల్టర్ మాస్క్- 99 అని దీనికి పేరు పెట్టారు.

ఇది నానో మెటీరియల్​తో తయారవుతుందని... ఎలాంటి వైరస్​నైనా చంపుతుందిని శేషగిరిరావు తెలిపారు. ఒక్క మాస్క్ కాల పరిమితి ఆరు నెలలు ఉంటుందని వివరించారు. ప్రత్యేకమైన ఈ మాస్క్ వైరస్​ను పూర్తిగా నిర్మూలిస్తుందని... మానవ శరీరానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక లేయర్లను మాస్క్​పై ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

దీని అనుమతుల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్​లో ఇప్పటికే పూర్తి వివరాలతో దరఖాస్తు చేశామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ఎంతగానే ఉపయోగపడుతుందని శేషగిరిరావు అన్నారు.

ఇదీ చదవండి: 'ఆ డబ్బుతో కరోనా ఆసుపత్రి నిర్మించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.