తెరాస ప్రభుత్వ హయాంలో భూములు మొత్తం కబ్జాలకు గురౌతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ ప్రక్షాళన పూర్తిగా భూ స్వాములు, జమీందార్లకు అనుకూలంగా జరుగుతోందని శాసన సభలో తెలిపారు. తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతన్న ఎప్పటికి పేదవానిగానే మిగిలిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దున్నేవాడి పేరుమీదే భూమి ఉండాలన్నది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట లక్ష్యమని..అయితే తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది పూర్తిగా అణగదొక్కబడుతోందని మండిపడ్డారు.
ఇవీ చూడండి: 'గ్రామాభివృద్ధి కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాం'