ETV Bharat / city

జీవో 111లోని ఆంక్షల ఎత్తివేతతో... భూముల ధరలకు రెక్కలే! - జీవో 111 ఎత్తివేతతో భూముల ధరలకు రెక్కలు

GO 111 News: రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల చిరకాల వాంఛ 26 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ప్రస్తుతం ఆంక్షలు తొలగించడంతో ఇళ్ల నిర్మాణాలు జరిగి భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. జీవో 111 ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి సబితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారన్నారు.

land prices Will grow
land prices Will grow
author img

By

Published : Apr 21, 2022, 6:16 AM IST

GO 111 News: జీవో 111 ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో... రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల చిరకాల వాంఛ 26 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా జీ+2 నిర్మాణాలకు అధికారులు అనుమతిస్తున్నారు. అవి కూడా గ్రామకంఠం పరిధిలో నిర్మించుకుంటేనే ఒప్పుకొంటున్నారు. ప్రస్తుతం ఆంక్షలు తొలగించడంతో ఇళ్ల నిర్మాణాలు జరిగి భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. రెసిడెన్షియల్‌ విల్లాలతో పాటు భారీ అపార్టుమెంట్లూ రానున్నాయి. హోటళ్లు, విలాస కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. అయితే ఈ జీవోపై ఉన్నత న్యాయస్థానాల్లో కేసులున్న నేపథ్యంలో వాటి ఆదేశాలపై అభివృద్ధి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కేసీఆర్‌ జీవో 111ను ఎత్తివేస్తామని చెప్పినప్పట్నుంచి ఆయా గ్రామాల్లో భూములకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఉత్తర్వుల జారీతో వాటి రేట్లు విపరీతంగా పెరగనున్నాయి. ప్రస్తుతం మెయినాబాద్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో రహదారికి సమీపంలో ఎకరా రూ.4-10 కోట్ల మధ్య పలుకుతోంది. ఇప్పుడది రెండింతలు కానుందని చెబుతున్నారు. జీవో పరిధి గ్రామాల్లో 1,32,600 ఎకరాల భూములున్నట్లు అంచనా. ఇప్పటికే అధికారికంగా 450 వరకు లేఅవుట్లు వేశారు. అనధికారికంగా మరో 500 ఉంటాయని అంచనా. అలాగే 31,483 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

జీవో 111 పేరా 3లో ఏముందంటే.. జీవో 111 పేరా 3లో పేర్కొన్న ఆంక్షలను తాజాగా సర్కారు ఎత్తివేసింది. వాస్తవానికి 111 జీవో కంటే ముందుగా 1994 మార్చి 31న జంట జలాశయాల పరిరక్షణకు జీవో 192 తీసుకువచ్చారు. అప్పట్లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా కొత్త నిబంధనలు తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం జీవో 111లోని పేరా 3లో ప్రకటించింది. దీని ప్రకారం..

* జలాశయాలకు ఉన్న పది కిలోమీటర్ల క్యాచ్‌మెంట్‌ ప్రాంత పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస సముదాయాలు, ఇతరత్రా నిర్మాణాలను నిషేధించింది. క్యాచ్‌మెంట్‌ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో వేసే లేఅవుట్లలో 60 శాతం స్థలాలు ఓపెన్‌ స్థలాలు, రోడ్లకు కేటాయించాలి.

* మాస్టర్‌ ప్లాన్‌లోని 90శాతం ప్రాంతాన్ని రిక్రియేషన్‌, కన్జర్వేషన్‌ అవసరాలకు గుర్తించాలి.

* జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారక అవశేషాలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆరు నెలలకోసారి వాటి ఫలితాలపై జలమండలి అధికారులు సమీక్షించాలి.

* గాలి కాలుష్యంతో నీటిలో ఆమ్లాలు కలిసే అవకాశం ఉన్నందున 10 కి.మీ. పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు నిర్మించకూడదు. నిషేధిత జోన్‌లో పరిశ్రమల స్థాపనకు పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వరాదు.

* గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్‌ వరకు నీటిని మోసుకొచ్చే కాండ్యూట్‌ చుట్టుపక్కల 100 అడుగుల వరకు భవన నిర్మాణానికి అనుమతులివ్వరాదు. లేఅవుట్లకు అనుమతిస్తే కాండ్యూట్‌ చుట్టుపక్కల కనీసం 9 మీ. వెడల్పుతో రోడ్లు నిర్మించి నిషేధిత వంద అడుగుల వరకు గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధి చేయాలి.

* 1989 జనవరి 18న ఇచ్చిన జీవోను రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లా పరిషత్‌లు, పంచాయతీరాజ్‌ విభాగం, నీటి పారుదల, సాంఘిక సంక్షేమ శాఖలు సమర్థంగా అమలు చేయాలి. భవన నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలు, నీటి నిల్వ రిజర్వాయర్లు నిర్మించరాదు.

మాట నిలబెట్టుకున్న కేసీఆర్‌... జీవో 111 ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి సబితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారన్నారు. సుదీర్ఘ కాలంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యకు సీఎం పరిష్కారం చూపించారన్నారు. మంత్రి కేటీఆర్‌కూ రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:జీవో 111 ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.