ETV Bharat / city

కళావిహీనంగా తయారైన లాల్‌బహదూర్‌ స్టేడియం - కళావిహీనంగా తయారైన లాల్‌బహదూర్‌ స్టేడియం

రాష్ట్రంలో పేరుపొందిన మైదానం లాల్‌ బహదూర్ స్టేడియం. ఇది ఎన్నో అంతర్జాతీయ క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ పోటీలకు వేదికగా నిలిచింది. క్రీడాకారులు, అభిమానుల కేరింతలతో కనిపించాల్సిన స్టేడియం ప్రస్తుతం కళతప్పింది. రాజకీయపార్టీల బహిరంగ సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో క్రీడాకారులకు మైదానం దూరమవుతోంది.

lal bahadur stadium
కళావిహీనంగా తయారైన లాల్‌బహదూర్‌ స్టేడియం
author img

By

Published : Oct 11, 2020, 5:47 AM IST

కళావిహీనంగా తయారైన లాల్‌బహదూర్‌ స్టేడియం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నడిబొడ్డున లాల్‌బహుదూర్ స్టేడియాన్ని నిర్మించారు. 1960 మార్చి 24న నీలం సంజీవ రెడ్డి ఈ మైదానాన్ని ప్రారంభించారు. మొదట పతే మైదానంగా పేరు ఉన్నా.. తర్వాత లాల్‌ బహుదూర్ స్టేడియంగా మార్చారు. ఇక్కడ సాధన చేసిన ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో జయసింహా, పటోడి, అజారుద్దీన్​, వెంకటపతిరాజుతో పాటు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పుల్లెల గోపిచంద్‌ వంటి వారు ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ మైదానం రాజకీయ, ప్రైవేట్ కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేక ప్రస్తుతం ఈ స్టేడియం కళావిహీనంగా తయారైంది.

బహిరంగ సభల వల్ల..

రాజకీయ పార్టీల బహిరంగ సభలకు, ప్రైవేట్‌ సంస్థల ఫంక్సన్స్‌కు క్రీడా ప్రాంగణాన్ని ఇవ్వడం వల్ల పోటీల నిర్వహణ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఫలితంగా యువ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైదానంలో డ్రెస్సింగ్‌ రూం, శౌచాలయాలు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. బహిరంగ సభల ఏర్పాట్ల వల్ల మైదానం స్వరూపాన్ని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశలు, అంచనాలపై నీళ్లు..

ఎల్బీ స్టేడియం నగరం మధ్యలో ఉండటంతో క్రీడాకారులకు సౌలభ్యంగా ఉంది. అయితే క్రీడాకారుల ఆశలు, అంచనాలపై రాష్ట్ర క్రీడాశాఖ నీళ్లు జల్లుతుంది. పాత పద్ధతిలో నిర్మించిన మైదానంలో ఆ నాటి పరిస్థితులను బట్టి మౌలిక సదుపాయాలు కల్పించారని.. ఇప్పుడు అవి సరిపోవడం లేదని రాష్ట్ర క్రీడాసాథికారక సంస్థ ఒప్పుకుంది. సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతామని శాట్స్‌ ఛైర్మన్‌ తెలిపారు. లాల్‌బహదూర్‌ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ ప్రత్యేకం.. ఏపీ ఎంసెట్ ర్యాంకర్ల మనోగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.