ETV Bharat / city

ఎంసెట్‌ కన్వీనర్‌ కోటాకు 55,531 మందే

రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద ఇంజినీరింగ్​లో చేరేందుకు విద్యార్థులకు ఆసక్తి తగ్గింది. 69,116 సీట్లుండగా... కేవలం 55,531 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఇందులోనూ కొంతమంది వెబ్​ ఆప్షన్లు ఇచ్చుకోరు. కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఇంకా తక్కువగా ఉండనుంది.

lack of students interest on eamcet convener quota seats in engineering
ఎంసెట్‌ కన్వీనర్‌ కోటాకు 55,531 మందే
author img

By

Published : Oct 21, 2020, 7:17 AM IST

రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌లో చేరేందుకు 55,531 మంది ఆసక్తి చూపారు. ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ముగియగా మొత్తం 55,531 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద 69,116 బీటెక్‌ సీట్లుండగా వాటిని ఆశించేవారు 55,531 మందే! కొందరు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోరు. వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే పోటీపడే వారి సంఖ్య ఇంకొంత తగ్గవచ్చని భావిస్తున్నారు. మంగళవారం నాటికి 28,674 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఈ నెల 22 వరకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు గడువుంది.

ఈసారి 30 సీట్లకూ అనుమతి

సాధారణంగా బీటెక్‌లో ఒక సెక్షన్‌కు 60 సీట్లుంటాయి. ఎన్నో ఏళ్లుగా అంత మొత్తం సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇస్తోంది. ఈ విద్యా సంవత్సరం మాత్రం కొత్త కోర్సులకు 30 సీట్లకు సైతం అనుమతి ఇవ్వడం విశేషం. కొత్త కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారో లేదోనన్న సంశయంతో జిల్లాల్లోని కళాశాలలు 30 సీట్లకే అనుమతి తెచ్చుకున్నాయి.

ఇదీ చూడండి: 'నీట్' ఫలితాల్లో ఎలాంటి తప్పులు లేవు: ఎన్​టీఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.