శుక్రవారం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలు ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఅర్... త్వరలో మరో టెక్నలాజికల్ ఐటీ సొల్యూషన్స్ సంస్థను వరంగల్లో ప్రారంభిస్తారంటూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంస్థలు, కంపెనీలకు వ్యాపార దక్షతను, పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు మేథో సాయాన్ని అందించే మైండ్ ట్రీ కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో సేవలు అందిస్తుందన్నారు. ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రమణ్యన్తో కలిసి కేసీఆర్... ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించననున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం ...