క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసి... ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల చిత్తశుద్ధిని మరోమారు చాటుకున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్న సమయంలోనూ రైతుబంధుకు రూ. 5250 కోట్ల విడుదలతో 50 లక్షలకుపైగా రైతులకు లబ్ధి చేకూరిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏది ఏమైనా రైతులే తమకు ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్దికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?