ETV Bharat / city

డిసెంబర్ నాటికి 85 వేల ఇళ్లు పేదలకు అందజేస్తాం: కేటీఆర్​ - మంత్రి కేటీఆర్​ తాజా వార్తలు

హైదరాబాద్​ నగరంలో ఈ ఏడాది డిసెంబర్​ నాటికి 85 వేల రెండు పడక గదుల ఇళ్లును.. లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో ఏ నగరంలో లేనంత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. చాల చోట్ల పనులు తుది దశకు చేరుకున్నామని మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ నాటికి 85 వేల ఇళ్లు అందజేస్తాం: కేటీఆర్​

author img

By

Published : Aug 26, 2020, 5:28 PM IST

జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై కేటీఆర్​ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు, జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం అధికారులు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో సుమారు 85 వేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. సుమారు రూ.9,700 కోట్లతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంతగా.. గ్రేటర్​ పరిధిలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని కేటీఆర్ వెల్లడించారు.

డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని వెంటనే పేదలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు కేటీఆర్​కు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున.. 24 నియోజకవర్గాలకు సూమారు లక్ష ఇళ్లు అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల క్యాచ్మెంట్ ఏరియా కూడా రూపొందించినట్లు మంత్రికి వివరించారు.

చాల చోట్ల పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని ప్రజలు, లబ్ధిదారుల జాబితాను వెంటనే సైట్​లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: 'పెద్దలకు రుణాలు కాదు..పేదలకు డబ్బులివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.