ETV Bharat / city

పోలీసులపై కార్పొరేటర్ దౌర్జన్యం.. కేటీఆర్ ట్వీట్.. డీజీపీ యాక్షన్

author img

By

Published : Apr 6, 2022, 11:54 AM IST

KTR Tweet Today : హైదరాబాద్‌లో బోలక్‌పూర్ పోలీసులపై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.

KTR Tweet Today
KTR Tweet Today

KTR Tweet Today : హైదరాబాద్‌ బోలక్‌పూర్‌లో పోలీసులపై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు డీజీపీకి ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పూట... పోలీసులు బోలక్‌పూర్‌లో తెరిచి ఉంచిన దుకాణాలు మూసేయాలని దుకాణదారులకు చెప్పారు. రంజాన్ సందర్భంగా తెరుచుకున్నామని దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కార్పొరేటర్ గౌసుద్దీన్.. పోలీసులపై దుర్భాషలాడారు. వాళ్లపైకి దూసుకెళ్లి దౌర్జన్యం చేశారు. దుకాణాలు మూసేదిలేదని వారితో వాగ్వాదానికి దిగాకు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

  • Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty

    No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2

    — KTR (@KTRTRS) April 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet About Police : పోలీసులను ధూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. స్పందించిన కేటీఆర్ డీజీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావులేదని, తప్పు చేసిన వాళ్లపై రాజకీయ పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.