ETV Bharat / city

దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది: కేటీఆర్​

కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్‌, అత్యవసరం - సమతుల్యత’ అంశంపై జినోమ్‌ వ్యాలీలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు.

దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది: కేటీఆర్​
దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది: కేటీఆర్​
author img

By

Published : Aug 4, 2020, 4:01 PM IST

కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై మంగళవారం జినోమ్‌ వ్యాలీలో చర్చ జరిగింది. ‘వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్‌, అత్యవసరం - సమతుల్యత’ అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చటించారు. ఫార్మారంగంలో మూడింతల మందులు హైదరాబాద్‌ నుంచే ఉత్పత్తి జరగుతోందని కేటీఆర్​ తెలిపారు. ఫార్మారంగంలో హైదరాబాద్​ అగ్రస్థానంలో ఉందన్నారు.

కరోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌బ‌యోటెక్ ముందంజంలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. టీకాల అభివృద్ధి, త‌యారీలో భార‌త్ భాగ‌స్వామ్యం కీల‌క‌మైంద‌ని ప్ర‌పంచ‌దేశాలు ప‌దేప‌దే చెబుతున్నాయ‌‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ అవ‌స‌రాల దృష్ట్యా హైద‌రాబాద్ ప్రాముఖ్య‌త కూడా పెరిగిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ నుంచి మూడ‌వ వంతు వ్యాక్సిన్ ప్ర‌పంచ దేశాల‌కు అందించ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. మీ అంద‌రి నిరంత‌ర కృషి వ‌ల్లే ఇది సాధ్య‌మవుతోంద‌ని మంత్రి తెలిపారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కూడా మంత్రి కేటీఆర్ నిర్వ‌హించిన చ‌ర్చ‌లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరలోనే కరోనా వ్యాక్సిన్ : కృష్ణ ఎల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.