తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులు, యువత, విద్యార్థులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఆకర్షణీయమైన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆకస్మికంగా పోయినప్పటికీ, రెట్టించిన ఉత్సాహంతో తన కుటుంబం నిర్వహిస్తున్న కూరగాయల వ్యాపారంలో భాగస్వామ్యం పంచుకుంటూ వార్తల్లో నిలిచిన సాఫ్ట్వేర్ శారదకు అండగా నిలిచిన టీటా చొరవను మంత్రి అభినందించారు. ఆ తర్వాత ఆమెకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఒక్క రూపాయి ఖర్చులేకుండా టీటా అందించింది.
శిక్షణ పూర్తి చేసుకొని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ శిక్షణలో ఉత్తీర్ణత సాధించిన శారదకు మంత్రి కేటీఆర్ ధ్రువపత్రాన్ని తన చేతుల మీదుగా అందజేశారు. ఈ శిక్షణతో భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.. సాఫ్ట్ వేర్ శారదను ఆదర్శంగా తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఇవీ చూడండి: 'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు'