ETV Bharat / city

మా పరిధి తేల్చండి.. కృష్ణానదీ యాజమాన్య బోర్డు విజ్ఞప్తి.. - కృష్ణానదీ యాజమాన్యబోర్డు వార్తలు

2014లో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏర్పాటైనా ఇప్పటివరకు బోర్డు పరిధి నిర్ణయం కాలేదు. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేసిన తర్వాతనే ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వస్తాయి. పరిధి, అధికారాలపై అపెక్స్‌ కౌన్సిల్‌లో తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్యబోర్డు కోరింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి దృష్టికి బోర్డు ఛైర్మన్‌ తీసుకెళ్లారు.

Krishna river management board
Krishna river management board
author img

By

Published : Jun 16, 2020, 8:41 AM IST

Updated : Jun 16, 2020, 8:55 AM IST

పరిధి, అధికారాలపై అపెక్స్‌ కౌన్సిల్‌లో తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రజల్‌శక్తి మంత్రిని కృష్ణానదీ యాజమాన్యబోర్డు కోరింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర జల్‌శక్తి మంత్రితో జరిగిన సమావేశంలో బోర్డు సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, బోర్డు అభిప్రాయాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. 2014లో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏర్పాటైనా ఇప్పటివరకు బోర్డు పరిధి నిర్ణయం కాలేదు. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేసిన తర్వాతనే ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వస్తాయి. దీనిపై గత ఐదేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది.

కేంద్ర మంత్రి దృష్టికి బోర్డు చర్చించిన అంశాలు

కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరిందని, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు నోటిఫై చేసిన తర్వాతే ఈ అంశంపై చర్చించాలని తెలంగాణ చెబుతోందని, అయితే అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు ఈ అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నది తన అభిమతమని కేంద్రమంత్రి దృష్టికి బోర్డు ఛైర్మన్‌ తెచ్చారు. అపెక్స్‌ కౌన్సిల్‌కు కేంద్ర మంత్రి ఛైర్మన్‌ కాగా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

66:34 శాతం వినియోగించునేలా నిర్ణయం

అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తీసుకోవడానికి వీలుగా అన్ని ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్‌)లను అందజేయాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశించామని బోర్డు ఛైర్మన్‌ చెప్పారు. గత ఏడాదిలాగానే 66:34 శాతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వినియోగించుకునేలా నిర్ణయం జరిగిందన్నారు. టెలిమెట్రీల ఆవశ్యకత గురించి రెండు ప్రభుత్వాలకు వివరించాలని కేంద్ర మంత్రిని కోరారు. డ్యాంలు నిండుగా ఉన్నప్పుడు వరద నీటి వినియోగాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పరిశీలిస్తుందని, జూన్‌30లోగా వివరాలివ్వాలని సూచించామని కేంద్ర మంత్రికి చెప్పారు.

కార్యాలయం తరలింపుపై చర్చ

బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి తరలించడంపైనా చర్చ జరిగిందని, దీనిపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంటుందని చెప్పామన్నారు. గోదావరి నుంచి పోలవరం ద్వారా కృష్ణాలోకి మళ్లించే నీటిలో తెలంగాణకు వాటాపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోరామని మంత్రి దృష్టికి ఛైర్మన్‌ తెచ్చారు. తాగునీటికి వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపైనా చర్చ జరిగిందన్నారు.

ఇదీ చదవండి: కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం

Last Updated : Jun 16, 2020, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.