HIT OTT: చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరక్క కష్టాలు, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల నుంచి ఆంక్షలు, వీటికి పరిష్కారం చూపిస్తూ సరికొత్త ఓటీటీ అందుబాటులోకి రానుంది. హిట్ పేరుతో తయారైన ఈ ఓటీటీని అమెరికాలో ఉండే తెలుగోడు రూపొందించటం విశేషం. 4కే నాణ్యతతో దృశ్యాల్ని ప్రేక్షకులకు అందించటంతో పాటు 30 భాషల్లో సినిమాలు ఈ వేదికపై విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కొల్లు రంజిత్ స్వస్థలం విజయవాడ. ఇక్కడే ఇంజినీరింగ్ వరకూ చదివిన రంజిత్ ఐఐఎంలో ఎంబీఏ, అమెరికాలో ఎం.ఎస్. చేశారు. ప్రస్తుతం అమెరికాలో డెల్ సంస్థలో సైబర్ సెక్యూరిటికీ సంబంధించి టీం లీడర్‌గా ఉన్నారు. తన మిత్రుడు వెంకట్ ఏలేటితో కలిసి కొత్త ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు.
HIT OTT: కరోనా మొదలైనప్పటి నుంచి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. నిర్మాతలే తమ సినిమాల్ని అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు టికెట్ ధరలు వారే నిర్ణయించుకోవచ్చు. టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లో సినిమా చూడొచ్చు. మూడు ఫార్మాట్లకు సంబంధించి దీన్ని డిజైన్ చేశారు. టీవీ రకాన్ని బట్టి 4కే, హెచ్‌డీ, సెమీ హెచ్‌డీ, ఎస్‌డీ ఫార్మాట్లలో సినిమా వస్తుంది. కొత్త సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి సంబంధించిన సర్వర్ల నుంచి సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశామని రంజిత్ చెబుతున్నారు.
ఇవీ చదవండి: