ETV Bharat / city

Lands E-auction: ఖానామెట్‌లోని 15.01 ఎకరాల భూమికి నేడు ఈ-వేలం - Lands E-Auction by hmda

కరోనాతో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం నిర్వహించనున్న భూముల విక్రయాలు నేడు కూడా కొనసాగునుంది. మొదటి విడత భూముల విక్రయం ద్వారా కనీసం 1600 కోట్లు రూపాయలు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గురువారం నిర్వహించిన కోకాపేట భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,000.37 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. నేడు ఖానామెట్‌లోని 15.01 ఎకరాల భూమిని ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయించనున్నారు.

Lands E-auction
Lands E-auction
author img

By

Published : Jul 16, 2021, 5:19 AM IST

హైదరాబాద్ ఖానామెట్​లో మొత్తం 15.01 ఎకరాల భూమిలోని 5 ప్లాట్లకు ఇవాళ ఈవేలం నిర్వహించనున్నారు. ఖానామెట్​లో ప్లాట్ నెం-4 లో 3.15 ఎకరాలు, ప్లాట్ నెం-6 లో 3.15 ఎకరాలు, ప్లాట్ నెం-12 లో 3.69 ఎకరాలు, ప్లాట్ నెం-14 లో 2.92 ఎకరాలు, ప్లాట్ నెం-17 లో 2.10 ఎకరాలు ఏర్పాటు చేశారు. ఈ వేలంపాటలో వ్యక్తిగతంగా లేదా వ్యక్తుల సమూహం, లేదా కంపెనీలు ఎవరైనా వేలంలో పాల్గొనొచ్చు.

వాణిజ్యపరమైన సముదాయాలు, వినోదభరి ప్రాంతాలు, రవాణా సౌకర్యం ఉండడంతో అధికంగా ఇక్కడ ధర పలికే అవకాశం కనిపిస్తోంది. భూములకు కూడా ఎలాంటి చిక్కులు కూడా లేవని.. సింగిల్ విండో ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో త్వరతగతిన అనుమతులు ఇస్తమని టీఎస్ఐఐసీ చెబుతోంది. ఈ ఆక్షన్ నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

కనకవర్షం కురిపించిన కోకాపేట భూములు..

నిన్న జరిగిన కోకాపేట భూముల వేలం రాష్ట్ర ప్రభుత్వానికి కనకవర్షం కురిపించాయి. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్ లోని భూములు రికార్డు ధర పలికాయి. గరిష్టంగా ఎకరానికి ఏకంగా 60 కోట్లా 20 లక్షల రూపాయల ధర పలికింది. 1.65 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమిని రాజపుష్ప రియాల్టీ సంస్థ ఎకరం 60.2 కోట్ల చొప్పున 99.33 కోట్లకు దక్కించుకొంది. సగటున ఎకరం 40.05 కోట్ల ధరను కోకాపేట భూములు పలికాయి. మొత్తం 49.949 ఎకరాల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,000.37 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. భూముల అమ్మకం కోసం హెచ్ఎండీఏ ఇవాళ ఈ-వేలం నిర్వహించింది.

కోకాపేటలోని భూములను వేలం వేయడానికి ప్రభుత్వం ఏడాది కిందట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 49.92 ఎకరాలను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంచర్‌గా మార్చే పనిని హెచ్‌ఎండీఏ భుజానికెత్తుకుంది. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించింది. ఒక్కో ఎకరం కనీసం ధర రూ.25 కోట్లుగా నిర్ధారించింది. దీనికి అనుగుణంగా ఈ-వేలం నిర్వహించింది. ఈ వెంచర్‌కు నియోపొలిస్‌ పేరు పెట్టింది. అవుటర్‌ పక్కనే ఈ వెంచర్‌ ఉంది. ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి అవుటర్‌ నుంచి నేరుగా రావడానికి వీలులేదు. ఫైనాన్షియల్‌ జిల్లా నుంచి కోకాపేటకు రావాలంటే ఇంటర్‌ ఛేంజ్‌లో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి అవుటర్‌ మీదుగా నేరుగా నియోపోలిస్‌ లేఅవుట్‌లోకి రావచ్చు. దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది.

అందరి దృష్టి అటువైపే!

గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినప్పుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. ఈ నియోపోలిస్‌ వెంచర్‌ ఏర్పాట్లన్నింటిని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. వెంచర్‌ లోపల వంద అడుగుల రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను రేపు వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్‌ మైల్‌ అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత కథనం: kokapet lands : కోట్లలో పలికిన కోకాపేట భూములు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.