తనను కాదన్నాడనే అక్కసుతో ఓ వ్యక్తిపై యాసిడ్ దాడికి(acid attack kerala) దిగిందో మహిళ. కేరళలో జరిగిన ఈ దారుణ ఘటనలో బాధిత వ్యక్తి కంటి చూపు కోల్పోయాడు.
ఫేస్బుక్లో మూడేళ్లు..
తిరువనంతపురంలో నర్సుగా పనిచేస్తున్న 36ఏళ్ల షీబాకు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా అరుణ్ కుమార్‌తో పరిచయమైంది. కొన్నాళ్ల స్నేహం అనంతరం షీబాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకున్న అరుణ్ ఆమెతో విడిపోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇతర మహిళలతో చనువుగా ఉంటున్నాడు. ఇది తెలిసి షీబా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో కొన్నాళ్లుగా ఇద్దరూ సరిగా మాట్లాడుకోవట్లేదు.
ఈ క్రమంలోనే అరుణ్‌ని ఆదిమలిలోని ఓ చర్చికి రావాల్సిందిగా కోరింది. మాట్లాడుతుండగానే.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అరుణ్ ముఖంపై పోసింది (acid attack latest news). ఆ సమయంలో తన ముఖంపైనా యాసిడ్ పడటంతో గాయాలపాలైంది.
కంటిచూపు కోల్పోయి..
తనపై యాసిడ్ దాడి(kerala acid attack) జరగ్గానే అరుణ్ కుమార్ తన స్నేహితుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లాడు. ప్రస్తుతం తిరువనంతపురం మెడికల్ కాలేజీలో (thiruvananthapuram medical college) చికిత్స పొందుతున్నాడు. 'ముఖంపై యాసిడ్ పడటంతో ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయాడని' వైద్యులు తెలిపారు.
'దీనిపై తమకు ఫిర్యాదు అందనందువల్ల కేసు నమోదు చేయలేదని' పోలీసులు(kerala police) తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు.. షీబా ముఖంపై ఉన్న యాసిడ్ మచ్చలను దాచేందుకు ఆమె భర్త ప్రయత్నించాడు. అవి ప్రమాదవశాత్తు అయిన గాయాలేనని భర్త తరఫు కుటుంబసభ్యులు తెలపడం గమనార్హం.