ఇరురాష్ట్రాల మంత్రుల మీడియా సమావేశం...
- ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు జరిగాయి: మంత్రి ఈటల
- చిన్నచిన్న సమస్యలతో పాటు సాగునీటి సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది: మంత్రి ఈటల
- సరిపడా సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి: మంత్రి ఈటల
- ఇరు రాష్ట్రాల్లోని పంటపొలాలకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది: మంత్రి ఈటల
- ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణలు లేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనేది మా విధానం: మంత్రి ఈటల
- ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు:మంత్రి ఈటల
- ఇవాళ్టి సమావేశం కొనసాగింపుగా రేపు ఉన్నతాధికారులు సమావేశం అవుతారు;మంత్రి ఈటల
- దేశంలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా తెలంగాణ, ఏపీ ఎదగాలనేది మా ఆశయం;మంత్రి ఈటల
- ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలు వినియోగించుకోవడంపై ప్రధాన చర్చ జరిగింది: ఏపీ మంత్రి బుగ్గన
- ఏయే ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందనే విషయంపై ఇరువురు సీఎంలకు మంచి అవగాహన ఉంది: ఏపీ మంత్రి బుగ్గన
- నీటి సమస్య పరిష్కారానికి సూచనలు, వ్యూహాలు ఇవ్వాలని అధికారులు, ఇంజినీర్లకు చెప్పారు: ఏపీ మంత్రి బుగ్గన
- రెండు రాష్ట్రాలు జల వివాదాలు పరిష్కరించుకుని దేశానికే ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నాం: ఏపీ మంత్రి బుగ్గన
- కోర్టుకు, ట్రైబ్యునళ్లకు వెళ్లినా.. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు: ఏపీ మంత్రి బుగ్గన
- సామరస్యంగా చర్చించుకుని సమస్య పరిష్కరించుకుందామనే భావన ఇరువురు సీఎంలలో ఉంది: ఏపీ మంత్రి బుగ్గన
- అభివృద్ధి కోసం సోదరులుగా కలిసి ప్రయాణం చేద్దామని ఇరువురు సీఎంలు నిర్ణయించుకున్నారు: ఏపీ మంత్రి బుగ్గన
- నదీజలాల వినియోగానికి సంబంధించి జులై 15లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరారు: ఏపీ మంత్రి బుగ్గన
- గోదావరి జలాలను గరిష్ఠంగా వాడుకోవడంపై దృష్టి సారించారు: ఏపీ మంత్రి బుగ్గన
- రెండు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకోవల్సిన అంశాలపై అధికారులు ఇంకా చర్చలు చేస్తున్నారు: ఏపీ మంత్రి బుగ్గన
- ఏపీకి చెందిన భవనాలు హైదరాబాద్‌లో నిరుపయోగంలో ఉన్నాయి : ఏపీ మంత్రి బుగ్గన
- వాడుకోలేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం కారణాలతోనే ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగించాం: ఏపీ మంత్రి బుగ్గన