రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కట్టెలమండిలో 120 రెండు పడక గదుల ఇళ్లను.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. దశలవారీగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు. కట్టెలమండిలో ఉండే వారంతా కలిసి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. లబ్ధిదారుల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు కేటీఆర్. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను అమ్ముకోవడం నేరమన్న మంత్రి.. రెండు పడకల గదుల ఇళ్లను అమ్ముకునే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.
ఒకప్పుడు విద్యుత్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ లేకపోతే వార్తని మంత్రి అన్నారు. ఆరేళ్లలో అనేక సమస్యలను పరిష్కరించామన్న కేటీఆర్.. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నాం: కేటీఆర్