ETV Bharat / city

Women Pilot: చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది..! - కశ్మీర్​ యువతి మావ్యా సూదన్

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌( mavya sudhan). జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా( indian air force fighter pilot) నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

Women Pilot form kashmir
ఫైటర్​ పైలెట్​గా ఎన్నికైన కశ్మీర్ యువతి
author img

By

Published : Jun 23, 2021, 5:24 PM IST

ప్రపంచంలో అతిపెద్ద వైమానిక దళాల్లో ఒక్కటైన భారత వాయుసేనకు (IAF) సుమారు 90 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. కానీ ఐదేళ్ల క్రితం వరకు కేవలం హెలికాప్టర్‌, విమానాలు.. వంటి వాయు రవాణా సర్వీసుల్లో మాత్రమే మహిళల్ని పైలట్లుగా నియమించుకునేది. ఈ క్రమంలో మహిళా శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపునిస్తూ 2016 నుంచి దేశ రక్షణ కోసం పోరాడే యుద్ధ విమానాల్లో సైతం మహిళల్ని పైలట్లుగా నియమించుకుంటోంది. అవనీ చతుర్వేది, మోహనా సింగ్‌, భావనాకాంత్‌, శివాంగీ.. ఇలా ఇప్పటివరకు 11 మంది మహిళలు ఫైటర్‌ పైలట్లుగా నియమితులయ్యారు. కశ్మీర్‌కు చెందిన మావ్యా సూదన్‌( mavya sudhan) తాజాగా ఈ జాబితాలోకి చేరింది.

ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని!

మావ్యాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని లంబేరి అనే గ్రామం. తన కష్టానికి తోడు తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహం కూడా జతవ్వడంతో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. ఫైటర్‌ పైలట్‌గా ఎంపికైన ఆమె సుమారు ఏడాది కాలంగా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ను కూడా పూర్తి చేసుకుంది. తద్వారా యుద్ధ విమాన పైలట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

ఏదైనా సాధిస్తారు!

ఈ క్రమంలో తమ కూతురుని చూసి తెగ సంబరపడిపోతున్నారు మావ్యా తల్లిదండ్రులు. ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ పూర్తయిందో అప్పటినుంచే ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

‘మా అమ్మాయిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆమె తన కష్టంతోనే నేడు ఈ స్థాయికి చేరుకుంది. తల్లిదండ్రులు తమ కూతుళ్లను ప్రోత్సహిస్తే ఏదైనా సాధిస్తారు.. అందుకు మా అమ్మాయే నిదర్శనం. ఇప్పుడు తను కేవలం మా అమ్మాయి మాత్రమే కాదు. ఈ దేశ ప్రజలందరి ముద్దు బిడ్డ’ అని ఆమె తండ్రి వినోద్‌ సూదన్‌ ఉప్పొంగిపోయారు.

రోల్‌ మోడల్‌గా నిలిచింది!

‘నా చిన్న కూతురు బాగా కష్టపడింది. తన కలను సాకారం చేసుకుంది. మావ్యాను చూస్తుంటే నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది’ అని తల్లి సుష్మ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూనియర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న మావ్యా సోదరి మాట్లాడుతూ ‘పైలట్‌ కావాలని తను చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉండేది. తన హార్డ్‌వర్క్‌తో తన కోరిక నెరవేర్చుకుంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సి చాలా ఉంది. ప్రస్తుతం మావ్యాను ప్రతి ఒక్కరూ సొంత కూతురిలా భావిస్తున్నారు. మాకు అభినందనలు తెలుపుతూ ఎక్కడెక్కడి నుంచో సందేశాలు వస్తున్నాయి. నేటి తరం అమ్మాయిలందరికీ నా చెల్లి రోల్‌మోడల్‌గా నిలిచింది’ అంటోంది.

ఈ క్రమంలో- సోషల్‌ మీడియా వేదికగా మావ్యాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా లాంటి ప్రముఖులతో పాటు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదీ చూడండి: DH Srinivasa Rao: చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.