ETV Bharat / city

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన సీఐ

తనకు అన్యాయం జరుగుతోందనీ.. న్యాయం చేయాలని.. ఓ ఎస్సీ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు బాధ వినకుండానే.. సీఐ బూటు కాలితో తన్నాడు.. అక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ కసిరాడు.. సీఐ నుంచి తన కుమారుడిని రక్షించుకోవటానికి బాధితుడి తల్లి ప్రయత్నించింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో విశాఖ రేంజ్​ డీఐజీ స్పందించారు.

author img

By

Published : Aug 5, 2020, 5:26 PM IST

police attack on sc
police attack on sc

ఏపీలో మరో ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగింది. బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ.. బూటు కాలితో ఎస్సీ వ్యక్తిని తన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్​ ఆవరణలోనే జరిగింది. చుట్టూ పెద్ద మనుషులు ఉన్నా ఒక్కరూ పట్టించుకోలేదు.

పలాస మండలం టెక్కలిపట్నంకు చెందిన ఎస్సీ వ్యక్తి ఇంటి స్థలంపై గత 5 రోజులుగా వివాదం జరుగుతోంది. తనకు న్యాయం చేయాలని కాశీబుగ్గు పోలీస్ స్టేషన్​కు వచ్చి.. సీఐకు పరిస్థితిని వివరిస్తుండగా.. సీఐ వేణుగోపాల్ ఆ వ్యక్తిపై తన ప్రతాపం చూపాడు. బూటు కాలితో తన్ని.. దాడికి దిగాడు. పక్కనే ఉన్న బాధితుడి తల్లి... సీఐ నుంచి తన కుమారుడుని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. చుట్టూ పెద్ద మనుషులు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకో లేదు. బాధితుడు ఏడుస్తున్నా.. సీఐ కనికరం చూపలేదు.

సీఐ వేణుగోపాల్​పై సస్పెండ్ వేటు

సీఐ వేణుగోపాల్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటనపై స్పందించిన విశాఖ రేంజ్ డీఐజీ.. కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్​ను సస్పెండ్ చేశారు. సివిల్ వివాదంలో ఫిర్యాదుదారుడిపై అనుచితంగా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.