ETV Bharat / city

వైద్యం ఖర్చులు భరించలేక.. తండ్రే చంపేశాడు!

author img

By

Published : Mar 2, 2020, 6:54 PM IST

Updated : Mar 2, 2020, 7:33 PM IST

గతనెల 10న ఇంటర్ విద్యార్థిని రాధిక అనుమానాస్పద హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాధికను హత్య చేసింది తండ్రే అని తేల్చారు పోలీసులు.

Karim nagar Sp press meet On Radhika murder
వైద్యఖర్చులు భరించలేక.. తండ్రే చంపేశాడు!

గత నెల 10న కరీంనగర్​లో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుమార్తె వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు లేక.. తండ్రే రాధికను దిండుతో నొక్కి చంపాడని పోలీసులు తేల్చి చెప్పారు. అనారోగ్యంతో ఉన్న కూతురుకు వైద్యం చేయించలేక ఆమెను హత్య చేసి.. బంగారం, డబ్బు కోసం తన కూతురును ఎవరో హత్య చేశారని నమ్మించాడు.

ఈ కేసును సవాలుగా తీసుకున్న కరీంనగర్ పోలీసులు జర్మన్ సాంకేతికతతో రాధిక హత్య కేసును ఛేదించారు. అప్పటికే రూ. 6 లక్షల వరకు రాధిక వైద్యం కోసం ఖర్చు చేసిన తండ్రి కొమురయ్య అనారోగ్యంతో ఉన్న కూతురును భరించే శక్తి లేక, ఆమెకు మెరుగైన వైద్యం చేయించలేక.. దిండుతో నొక్కి చంపేశాడు.

ఆమె చనిపోయిన తర్వాత కత్తితో.. రాధిక గొంతు కోశాడు. పోలీసులకు అనుమానం రాకుండా రాధిక మృతదేహాన్ని మంచం పైనుంచి కిండపడేసి.. అందరినీ నమ్మించాడు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి.. 21 రోజుల పాటు దర్యాప్తు చేసి కేసును చేధించారు. కూతురును హత్య చేసిన కొమురయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Mar 2, 2020, 7:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.