ETV Bharat / city

Kalyana Lakshmi Scheme Funds Release 2021 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ నిధులు విడుదల - షాదీముబారక్ పథకానికి 150 కోట్ల నిధులు

Kalyana Lakshmi Scheme Funds Release 2021 : తెలంగాణలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు విడుదల చేస్తూ బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కల్యాణలక్ష్మికి.. రూ.462.50 కోట్లు, షాదీ ముబారక్​కు.. రూ.150 కోట్లు విడుదలయ్యాయి.

కల్యాణ లక్ష్మి నిధులు, షాదీ ముబారక్ నిధులు, కల్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం, Kalyana Lakshmi Scheme, Shadi Mubarak scheme
Kalyana Lakshmi Scheme Funds Release 2021
author img

By

Published : Nov 27, 2021, 9:10 AM IST

Kalyana Lakshmi Scheme Funds Release 2021 : తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులు విడుదలయ్యాయి. ఈ పథకాల కింద లబ్దిదారులకు చెల్లింపుల కోసం నిధులు విడుదల చేస్తూ.. బీసీ, మైనారిటీ సంక్షేమశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Shadi Mubarak Scheme Funds 2021 : కల్యాణలక్ష్మి పథకం కోసం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం వ్యయం కింద 462 కోట్లా 50 లక్షల రూపాయలు విడుదల చేశారు. షాదీ ముబారక్ పథకానికి సంబంధించి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల వ్యయం కింద 150 కోట్ల రూపాయలు కేటాయించారు.

తెలంగాణలో ప్రతి పేదింటి బిడ్డకు ఘనంగా వివాహం చేసేందుకు.. ఆడబిడ్డ తండ్రికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల్లో భాగంగా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు రూ. 1,00,116 కానుకగా ఇస్తోంది. తమ ఆడబిడ్డల వివాహం వైభవంగా జరిపేందుకు ఆర్థికంగా సాయపడుతున్న సీఎం కేసీఆర్​కు తెలంగాణలోని ప్రతి పేదింటి తండ్రి ధన్యవాదాలు చెబుతున్నాడు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.