ETV Bharat / city

'సీటు కేటాయించాక చేరకపోతే.. తదుపరి కౌన్సెలింగ్‌కు అనర్హులే'

కౌన్సెలింగ్​కు ముందే విద్యార్థులకు వైద్యకళాశాలపై స్పష్టత ఉండాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర రెడ్డి తెలిపారు. సీటు కేటాయించాక చేరకపోతే.. తదుపరి కౌన్సెలింగ్‌కు అనర్హులవుతారని... ధ్రువపత్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. అఖిల భారత కోటాతో మంచి అవకాశాలున్నాయంటున్న కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

'సీటు కేటాయించాక చేరకపోతే.. తదుపరి కౌన్సెలింగ్‌కు అనర్హులే'
'సీటు కేటాయించాక చేరకపోతే.. తదుపరి కౌన్సెలింగ్‌కు అనర్హులే'
author img

By

Published : Sep 25, 2020, 7:00 AM IST

దేశవ్యాప్తంగా ఏ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాలనే విషయంలో అభ్యర్థులకు ముందే స్పష్టత ఉండాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకర రెడ్డి తెలిపారు. ఆ ప్రాతిపదికనే వెబ్‌ఆప్షన్లలో వైద్యకళాశాలలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న కాలేజీల ప్రాధాన్యాన్ని అనుసరించే.. అతనికి వచ్చిన నీట్‌ ర్యాంకు ఆధారంగా కళాశాలను కేటాయిస్తారని పేర్కొన్నారు. కొవిడ్‌ వల్ల ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ జాప్యమైన నేపథ్యంలో.. డాక్టర్‌ కరుణాకర రెడ్డి.... ఈటీవీ భారత్​ ముఖాముఖిలో పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. అవి..

వైద్యవిద్య ప్రవేశాల జాప్యం ప్రభావం విద్యాసంవత్సరంపై ఎలా ఉంటుంది?

సాధారణంగా వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ జులైలో ప్రారంభమై, ఆగస్టు 31 నాటికి ముగుస్తుంది.ఈ ఏడాది కరోనా ప్రభావంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు 3 నెలలు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ నెలాఖరులోగా నీట్‌ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఆపై ప్రాథమిక అంచనా కోసం జాబితాను వెల్లడిస్తాం. అఖిల భారత కోటాలో మొదటి విడత పూర్తయ్యాక.. మన రాష్ట్రంలో మొదటి విడత ఉంటుంది. అఖిల భారత కోటాలో రెండో విడత పూర్తయ్యాక.. మిగిలిన సీట్లను రాష్ట్రాలకే ఇచ్చేస్తారు. ఆ తర్వాతే మన రాష్ట్రంలో రెండో విడత ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తాం. రాష్ట్రంలోనూ రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత మిగిలిన సీట్లకు ఆఖరివిడతగా మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహిస్తాం. ఈ ఏడాది అక్టోబరు రెండో వారంలో అఖిల భారత కోటాలో ప్రవేశ ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇది ప్రారంభమైన సుమారు 7-10 రోజుల్లో రాష్ట్రంలోనూ ప్రవేశాలు మొదలవుతాయి. అనంతరం కళాశాలల్లో తరగతుల నిర్వహణపై అప్పటి పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ప్రస్తుతం కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోనూ ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నారు.

కొవిడ్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసానికి విద్యార్థులు ఆసక్తి చూపుతారా?

కరోనా కేసుల తీవ్రత డిసెంబరు నాటికి కొంత తగ్గుముఖం పడుతుందని అంచనా. యూజీ విద్యార్థులు నిబంధనల మేరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిందే. అక్కడ కళాశాలల్లో చేరడం ద్వారా కొత్త పరిస్థితులను తెలుసుకుంటారు. అవగాహన పెరుగుతుంది. అనవసర భయాందోళనలతో వెనుకడుగు వేయరాదు.

స్థానికత విషయంలో వివాదాలు ఎదురవుతుంటాయి?

6-12వ తరగతి వరకూ విద్యాభ్యాసంలో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే.. దాన్నే స్థానికతగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణలో ఉండి.. పిల్లలు వేరే రాష్ట్రంలో చదువుకున్నారనుకుంటే.. అప్పుడు ఆ విద్యార్థులను స్థానికుల కోటాలో పరిగణించరు. వారిని అన్‌రిజర్వుడు కోటాలోకి మాత్రమే తీసుకుంటారు.

కొవిడ్‌ నేపథ్యంలో ప్రవేశ ప్రక్రియలో మార్పులుంటాయా?

కరోనా తీవ్రత తగ్గకపోతే.. ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లో చేస్తాం. కళాశాలల్లో చేరే సమయంలో నేరుగా పరిశీలిస్తారు. అప్పుడు తప్పుడు పత్రాలుగా గుర్తిస్తే సీటు కోల్పోతారు.

ఉపసంహరించుకునే వారిపై అనర్హత వేటు ఉంటుందా?

కొందరు విద్యార్థులు ముందు ఏదో ఒకచోట చేరుతున్నారు. తర్వాత ఆ కళాశాల నచ్చలేదనో.. దూరమనో.. మరో కారణంతోనో ఉపసంహరించుకుంటున్నారు. దీనివల్ల ప్రవేశ ప్రక్రియలో ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రవేశాలకు ముందే ఆసక్తి ఉన్న కళాశాలను ఎంచుకోవాలి. లేదంటే మానుకోవడమే మంచిది. విద్యార్థి ఆసక్తి ప్రకారమే.. వారు ఎంచుకున్న దాన్ని పరిగణనలోకి తీసుకుని.. విశ్వవిద్యాలయం సీటు కేటాయిస్తే.. ఆ తర్వాత వదులుకుంటామంటే నిబంధనలు ఒప్పుకోవు. ఎంచుకున్న తర్వాత సీటు వచ్చి చేరకపోయినా.. చేరి వదిలేసినా.. ఆ తర్వాత విడతకు ఆ విద్యార్థి తనంతట తానే ప్రవేశ అర్హత కోల్పోతాడు. కళాశాలలో సీటు వచ్చిన విద్యార్థి చేరిన తర్వాత.. మరుసటి విడతలకు అర్హుడే. అంతకంటే మెరుగైన కళాశాలను ఐచ్ఛికంగా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు బీడీఎస్‌లో ఒక కళాశాలలో సీటు వచ్చిందనుకుంటే.. ఆ విద్యార్థి ఆ కళాశాలలో చేరిన తర్వాత.. మరుసటి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఎంబీబీఎస్‌ రుసుములెలా ఉండబోతున్నాయి?

రుసుములను నిర్ణయించేది ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ). గతేడాది వరకైతే కన్వీనర్‌ కోటాలో రూ.60వేలు, యాజమాన్య కోటాలో రూ.11.50 లక్షలు, ప్రవాస భారతీయ కోటాలో రూ.11.50 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.23 లక్షల వరకూ ఉంది. ప్రవేశ ప్రకటనకు ముందు రుసుములు స్థిరీకరిస్తే.. కొత్త రుసుములు అమల్లోకి వస్తాయి. లేకపోతే గతేడాది రుసుములే కొనసాగుతాయి.

అఖిల భారత కోటా ప్రవేశాల్లో అవకాశాలెలా ఉంటాయి?
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత వైద్యవిద్య కోటాకు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 1,650 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వీటిలో 246 సీట్లను అఖిల భారత కోటాకు ఇవ్వాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు అఖిల భారతస్థాయిలో దాదాపు 8వేల సీట్లకు పోటీపడతారు. ప్రతిభావంతులకు ఇదొక మంచి అవకాశం. రాష్ట్రంలో మిగిలిన 85 శాతం సీట్లనూ.. ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను కలుపుకొని మొత్తంగా కన్వీనర్‌ కోటాలో రాష్ట్ర స్థాయిలో భర్తీ చేస్తాం.

రాష్ట్రంలో కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఎలా సన్నద్ధమవ్వాలి?

ప్రవేశ ప్రకటన వెలువడిన తర్వాత ధ్రువపత్రాల కోసం వెతుకులాడడం కంటే ముందుగానే వాటిని సిద్ధం చేసుకోవడంపై దృష్టిపెట్టాలి. అవి..

  • నీట్‌ యూజీ 2020 అడ్మిట్‌ కార్డు, ర్యాంకు కార్డు
  • పుట్టిన తేదీ ధ్రువీకరణకు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ధ్రువపత్రం
  • ఇంటర్మీడియెట్‌ మార్కుల మెమో
  • 6 నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ విద్యాభ్యాస ధ్రువపత్రాలు
  • తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వెలుపల విద్యాభ్యాసం చేసిన విద్యార్థి తాను గానీ, తల్లిదండ్రులు గానీ పదేళ్ల పాటు ఎక్కడ నివాసమున్నారనే ధ్రువపత్రాలు
  • తాజా కుల ధ్రువీకరణ పత్రం
  • మైనారిటీ ధ్రువపత్రం
  • రుసుము మినహాయింపు పొందాలనుకుంటే అందుకు అవసరమైన ఆదాయ ధ్రువపత్రం
  • అగ్రవర్ణాల పేదలైతే ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)నే ధ్రువపత్రం
  • తమ సంతకంతో కూడిన అభ్యర్థి, తల్లి/తండ్రి ఆధార్‌ కార్డు నమూనా పత్రం
  • తాము పేర్కొన్న సమాచారమంతా సరైనదే అని పేర్కొంటూ రూ.100 బాండ్‌ పేపర్‌పై రాతపూర్వక వివరణ
  • దివ్యాంగుల కేటగిరీలో సీటు పొందాలనుకునేవారికి ఇప్పటికే సంబంధిత ధ్రువపత్రం ఉన్నా ప్రవేశాల సమయంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిపుణుల బృందం పరిశీలించి, దివ్యాంగ కేటగిరీకి అర్హతను ఖరారు చేస్తుంది.
  • ఇదే నిబంధన అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లోనూ ఉంది. అక్కడ ప్రవేశాలకు విడిగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ధ్రువీకరణ అఖిల భారత కోటాలో చెల్లుబాటు కాదు.
  • క్రీడా కోటా కోర్టు పరిధిలో ఉంది. దీనిపై కోర్టు తీర్పును అనుసరించి ప్రవేశాలు జరుగుతాయి.

ఇదీ చూడండి: ప్రారంభోత్సవానికి ముస్తాబైన 'కేబుల్ బ్రిడ్జి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.