KA Paul on CM KCR: తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆగడాలు ఇక సాగవని.. పతనం కోసం చర్యలు ప్రారంభమయ్యాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా మార్పు తెచ్చుకుంటే మంచిదని లేదంటే జైలు కెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. మీడియాతో మాట్లాడిన కేఏ పాల్... కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం, యాదాద్రిలో భయంకరమైన అవినీతి జరిగిందని వీటిపై విచారణ ప్రారంభమైందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో దేశంలో అప్పుల రూపంలో సునామీ వస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తెలంగాణ తరఫున తన చిన్న చిరు ప్రయత్నం ఫలించిందని... భాజపా గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని ఆమోదిస్తున్నానని కేఏ పాల్ తెలిపారు.
ఇవీ చదవండి: