ETV Bharat / city

జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. తీర్పు వచ్చే నెల 15కు వాయిదా - cm jagan case issue latest news

అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై గత కొంతకాలంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిశాయి. దీంతో ఈ రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు వెల్లడించింది. తీర్పు వెల్లడిని వచ్చే నెల 15కి వాయిదా వేసింది.

jagan bail
jagan bail
author img

By

Published : Aug 25, 2021, 2:46 PM IST

Updated : Aug 25, 2021, 2:52 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్​పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన హైదరాబాద్​లోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. అన్నివైపులా వాదనలు పూర్తికావడంతో జులై 30న విచారణ ముగించింది. ఆ రోజున తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

ఈ తీర్పు ఎలా ఉంటుందోనని అప్పటినుంచి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దునూ కోరుతూ రఘురామరాజు వేసిన పిటిషన్​పై ఇవాళే వాదనలు ముగియడంతో.. జగన్​తో పాటు విజయసాయిరెడ్డి పిటిషన్​పైనా సెప్టెంబర్ 15వ తేదీన ఒకేసారి తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు పేర్కొంది.

పిటిషన్ దాఖలైనప్పటి నుంచి వాదానలు ఇలా సాగాయి..

బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను ఏపీ సీఎం జగన్ ఉల్లంఘింస్తున్నారంటూ జూన్ 4న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ ప్రధాన వాదన. సహనిందితులు, సాక్షులుగా ఉన్న కొందరు అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని వాదించారు.

పిటిషన్ వేసినందుకు ఎంపీగా ఉన్న తనపైనే ఏపీ సీఐడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. ఇక సాక్ష్యం చెప్పబోయే పరిస్థితేమిటన్నారు. మరోవైపు రఘురామ కృష్ణరాజు పిటిషన్​కు విచారణ అర్హతే లేదని.. కొట్టివేయాలని జగన్మోహన్ రెడ్డి వాదించారు. ఎంపీగా అనర్హత వేటు వేయాలని వైకాపా కోరినందుకే... తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పిటిషన్ వేయగానే మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం రఘురామ ఉద్దేశాలను స్పష్టం చేస్తోందని జగన్ వాదించారు.

సీఎంగా ఉన్నందున బెయిల్ రద్దు చేయాలంటున్నారు తప్ప.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన కారణంగా ఒక్కటి కూడా చూపలేదని జగన్ పేర్కొన్నారు. సంబంధం లేని విషయాలను ప్రస్తావించి.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఊహించి.. పిటిషన్లు వేయడం తగదన్నారు. సీబీఐ మాత్రం తటస్థ వైఖరి ప్రదర్శించింది. పిటిషన్ లోని అంశాలను విచక్షణ మేరకు.. చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టును కోరింది. జులై 30న వాదనలు ముగించిన సీబీఐ కోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: KRMB: 50:50 నిష్పత్తిలో నీటి పంపకం సాధ్యం కాదని ఏపీ సర్కారు లేఖ

Last Updated : Aug 25, 2021, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.