ETV Bharat / city

'పబ్ ​లోపల దొరికిన మాదకద్రవ్యాలకు పూర్తి బాధ్యత నిర్వహకులదే..' - drugs in pub

Hyderabad Pub Case: పుడింగ్ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్​పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. డ్రగ్స్​కు పబ్​ నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదిస్తే.. పబ్​లోపల దొరికిన మాదకద్రవ్యాలకు పూర్తి బాధ్యత నిర్వహకులదేనని పోలీసుల తరఫు లాయర్​ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Judgment on bail of accused in Pudding Pub case postponed till tomorrow

author img

By

Published : Apr 20, 2022, 6:50 PM IST

Hyderabad Pub Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పుడింగ్ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్​పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. పబ్​లో దొరికిన మాదకద్రవ్యాలకు అభిషేక్, అనిల్​కు ఎలాంటి సంబంధం లేదని.. బెయిల్​ మంజూరు చేయాలని... నిందితుల తరఫు న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. కాగా.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ నేడు పోలీసుల తరఫు న్యాయవాది దుర్గాజీ వాదించారు.

పబ్​లో కొకైన్ దొరికినప్పుడు పూర్తిగా నిర్వాహకులే బాధ్యత వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పబ్​లోకి ప్రవేశించే ముందే ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసి పంపిస్తారని.. వినియోగదారులు డ్రగ్స్​ను లోపలికి తీసుకెళ్లే అవకాశమే లేదని దుర్గాజీ వాదించారు. పబ్ నిర్వాహకులే కొకైన్ విక్రయించే అవకాశం ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిగా వివరాలు సేకరించడానికి పోలీసులకు మరికొంత సమయం కావాలన్నారు. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని... సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ వాదించారు.

పోలీసులు ఇప్పటికే అభిషేక్, అనిల్​ను నాలుగు రోజుల కస్టడీకి తీసుకొని ప్రశ్నించారని, కొకైన్ విక్రయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని నిందితుల తరఫు న్యాయవాది అశోక్​ రెడ్డి వాదించారు. బెయిల్ ఇవ్వాలని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట మాదకద్రవ్యాల కేసులో నిందితులుగా ఉన్నవాళ్లకు, పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. పంజాగుట్ట కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ.. ఏజెంట్ల సాయంతో హైదరాబాద్, బెంగళూరు, గోవా, ముంబయిలో మాదకద్రవ్యాలు సరఫరా చేశాడు. బాబూషేక్, నూర్​మహమ్మద్ అనే ఏజెంట్లు హైదరాబాద్​లో 12 మంది వ్యాపారులకు డ్రగ్స్​ సరఫరా చేయడానికి వచ్చి టాస్క్​ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు.

పలు పబ్​లకు కూడా బాబూషేక్, నూర్​మహమ్మద్ మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాబూషేక్ వద్ద డ్రగ్స్​ తీసుకున్న కొందరు వ్యాపారులకు... పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం పరిచయం వరకు ఆగిపోయిందా..? లేక ఏమైనా లావాదావేలు నిర్వహించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.