ETV Bharat / city

Judge rama krishna: బెయిల్​పై విడుదలైన జడ్జి రామకృష్ణ

author img

By

Published : Jun 17, 2021, 9:17 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ బెయిల్​పై విడుదలయ్యారు. ఏపీ సీఎం జగన్​మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాజద్రోహం కేసులో ఆయనను అరెస్ట్​ చేశారు.

Judge RK Released
బెయిల్​పై విడుదలైన జడ్జి రామకృష్ణ

ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ బెయిల్​పై విడుదలయ్యారు. రూ.50 వేల రూపాయల సొంత పూచీకత్తుపై.. బెయిల్ మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఈనెల 15న తీర్పు ఇచ్చింది. ఉత్తర్వులు అందుకున్న పీలేరు సబ్ జైలు అధికారులు.. ఈరోజు ఆయనను విడుదల చేశారు.

బెయిల్​పై విడుదలైన జడ్జి రామకృష్ణ

జైలు బయట దళిత సంఘాల నాయకులు జడ్జి రామకృష్ణకు స్వాగతం పలికారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ.. హైకోర్టు స్పష్టమైన షరతులు విధించిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు వంశీకృష్ణతో కలిసి సొంత గ్రామమైన బి.కొత్తకోటకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణ అరెస్టయ్యారు.

ఇదీ చదవండి: HCA:హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అసలేం జరుగుతోంది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.