జేఎన్టీయూహెచ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసినట్టు రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. డిగ్రీ, పీజీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు. పరీక్ష జరిగే తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు.
భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బ తినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు షెడ్యూలు ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు