ETV Bharat / city

JEE Main 2021 Results: తెలుగు విద్యార్థుల హవా.. ఆరుగురికి మొదటి ర్యాంక్ - జేఈఈ మెయిన్‌ ఫలితాలల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

జేఈఈ మెయిన్‌ (నాలుగో విడత) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకులను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా.. వారిలో 18 మందికి మొదటి ర్యాంకు వచ్చింది. వీరిలో తెలుగు విద్యార్థులే ఆరుగురు ఉన్నారు.

jee-main-fourth-installment-results-have-been-released

author img

By

Published : Sep 15, 2021, 7:09 AM IST

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్‌ (నాలుగో విడత) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకులను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు హవా కొనసాగించారు. నలుగురు ఏపీ విద్యార్థులకు, ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్య, ఏపీ నుంచి దుగ్గినేని వెంకటపనీష్‌, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్‌ నాయుడు, కర్నం లోకేశ్‌కు మొదటి వచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.in లో తెలుసుకోవచ్చు.

మంగళవారం రాత్రి జేఈఈ ఫలితాలు ప్రకటిస్తారని పేర్కొనడంతో విద్యార్థులు వేచిచూశారు. తీరా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలు వెల్లడయ్యాయి. జేఈఈ మెయిన్‌ సెషన్‌-4 పరీక్ష ఆగష్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1న జరిగింది. సెప్టెంబర్‌ 6న పరీక్ష పత్రం కీ పేపర్‌ను విడుదల చేశారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ సెప్టెంబర్‌ 11న ప్రారంభం అవ్వాల్సి ఉండగా, ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబర్‌ 13కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఎన్‌టీఏ తీరుపై విమర్శల వెల్లువ

ర్యాంకుల విడుదల తేదీని ఎన్‌టీఏ స్పష్టంగా చెప్పకపోవడంతో జేఈఈ మెయిన్‌ ఫలితాల వెల్లడిలో విఫలమైందన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ర్యాంకుల ప్రకటనపై అధికారికంగా ప్రకటన కూడా జారీ చేయకపోవడంతో విద్యార్థులు ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్‌టీఏ అంటే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కాదని...నాట్‌ టుడే ఏజెన్సీ అని వ్యాఖ్యానిస్తూ కామెంట్లు పెట్టారు. మరోవైపు, గత మూడేళ్లుగా జేఈఈ మెయిన్‌ ఫలితాలను అర్ధరాత్రి, తెల్లవారు జామున విడుదల చేస్తూ విద్యార్థులతో చెలగాటమాడుతోందన్న విమర్శలు కూడా విద్యావేత్తల నుంచి వస్తున్నాయి. అయితే, ఫలితాల జాప్యానికి సీబీఐ విచారణ కారణం కాదని, సిబ్బంది అనారోగ్యానికి గురికావడం వల్లేనని ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ వినీత్‌ జోషీ మీడియాకు తెలిపారు.

ఇవీ చూడండి: మత్తులో చిన్నారులను చిదిమేస్తున్న ఉన్మాదులు.. రాష్ట్రంలో పెరుగుతున్న పోక్సో కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.