ETV Bharat / city

'బీఎస్ 4' కేసు: జేసీ ప్రభాకర్​ రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తి - jc prabhakarreddy case investigation news

బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్​ వ్యవహారంలో పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తైంది. పోలీసు విచారణను తప్పుబట్టిన ప్రభాకర్​రెడ్డి.. ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి.. తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్​ చేశారు. తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'బీఎస్ 4' కేసు
'బీఎస్ 4' కేసు
author img

By

Published : Jun 22, 2020, 9:37 AM IST

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారన్న అభియోగంపై పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తైంది. వీరిద్దరినీ ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు విచారించారు. మొత్తం 64 ప్రశ్నలతో విచారించి సమాచార నివేదికను తయారుచేశారు. పోలీసు విచారణ తీరును జీసీ ప్రభాకర్​రెడ్డి తప్పుబట్టారు. రిజిస్ట్రేషన్​ చేసిన అధికారులు, విక్రయదారులను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అధికారులను నిలదీశారు. పోలీసుల ప్రశ్నావళి అంతా తానొక్కడే తప్పు చేసినట్లుగా ఉందని ప్రభాకర్​రెడ్డి ఆరోపించారు.

'మిగిలిన వారిని ప్రశ్నించాలి'

ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి.. ఎక్కడ తప్పు జరిగిందో తేల్చాలని జేసీ ప్రభాకర్​రెడ్డి డిమాండ్​ చేశారు. ప్రతి వాహనం తన ఖాతా చెక్కుల ద్వారానే కొనుగోలు చేశానన్న ఆయన.. తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం కోర్టుకు..

జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిలకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం వీరిని ఒకటో పట్టణ పోలీసులు అనంతపురం కోర్టుకు తరలించనున్నారు.

ఇదీ చూడండి: నేడు 4 స్లిప్​, లింక్​ రోడ్లను ప్రారంభించనున్న కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.